Thursday, August 19, 2010

బతికితే మురళీమోహన్ లా బతకాలి ......Actor AVS

మురళీమోహన్ గారి పుట్టిన రోజు సెలిబ్రేషన్ అయినప్పటి నుంచి నా బ్లాగ్ లో ఆయన గురించి రాద్దామని ప్రయత్నిస్తున్నా, కోతిమూక సినిమా ఫినిషింగ్ లో ఉండటం వల్ల కుదర్లేదు . ఇవ్వాల్టికి వీలుపడింది మంచి విషయం చెప్పుకోవడానికి ఆలస్యం అనే అంశం పరిగణలోకి రాదు.

మురళీమోహన్ గారిని చూస్తుంటే ఆనందం...ఈర్ష్య ...ప్రేరణ...కలుగుతాయి . ఆయన 72లోకి ఏంటరయ్యారు . ఆయన్ను చూసినవాళ్ళెవరయినా ఆయన వయస్సు 72 అంటే నమ్మరు .ఒక మంచి మనిషి ఈ వయస్సులోకూడా ఇంత ఆరోగ్యంగా ... ఉత్సాహంగా .. ఉన్నారంటే అదో ఆనందం. ఆయనకంటే ఇరవై యెళ్ళు పైగా చిన్నవాళ్ళమైన నా లాంటి వాళ్ళకంటే ఆయన హుషారుగా ఉన్నారన్న ఈర్ష్య .మానసిక యవ్వనానికి వయసుతో సంబంధం లేదనేందుకు ఉదాహరణగా కనిపించే ఆయన అందరికీ ఓ ప్రేరణ . ఆయన ఎంత మంచి వాడో అంత నిర్మొహమాటి . ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టేస్తారు .ఎవరు ఏ అకేషన్ కు పిలిచినా ఓపిగ్గా వెళతారు . నిర్మాత గానో , నటుడి గానో , రియల్ ఎస్టేట్ వ్యాపారి గానో , ఆయన సాధించిన విజయాలు అందరికీ తెలుసు , కానీ ఓ విద్యా దాతగా ఆయన సేవలు అజరామరం . ఈ రోజున షుమారు వెయ్యి మంది పేద విద్యార్దులు ఆయన డబ్బు తో మెడిసిన్ , ఇంజినీరింగ్ చదువుతున్నరంటే మన గుండె తడవక మానదు . వాళ్ళల్లో షుమారు 120మంది పైగా గత రెండు మాసాల కాలంలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించారంటే అది మురళీమోహన్ గారి గొప్పతనం . వాళ్ళ ఆశీర్వచనం చాలు మురళీమోహన్ గారికి వెయ్యేళ్ళ ఆయుష్షు . అలాగే మూవీ అర్టిస్టు ల సంఘానికి ఆయన సారధ్యం ఆదర్శప్రాయం. సమస్యలను ఆయన పరిష్కరించే తీరు, మా కార్య కలాపాల ఉధౄతికి ఆయన పాలనా దక్షతా అందరూ అనుసరించదగ్గవి . మురళీమోహన్.... ఒక గొప్ప మానవతా వాది . కన్నీళ్ళు ఇంకిపోని మనిషి... కన్నీటి విలువ తెలిసిన మనిషి . నాకు జరిగిన ఆపరేషన్ సమయం లో ఆయన ఒక అన్న కంటే ఎక్కువగా నిలబడి నన్ను ఆదుకున్నారు . ఇవ్వళ ఇలా కూర్చొని బ్లాగు రాస్తున్నా ,మరేం చేస్తున్నా ఆ పుణ్యం అంతా మా అమ్మాయి తరువాత , మురళీమోహన్ గారిదే . ఆయన పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా కోరుకునే కోర్కె ఒక్కటే " మురళీమోహన్ బావుండాలి " అని . అఫ్ కోర్స్ మంచివాళ్ళందరూ బావుంటారు ..... మురళీమోహన్ లాంటి అతి మంచి మనిషి మరీ బావుంటాడు . అందుకే అందరం మంచిగా ఉందాం . అప్పుడే అందరూ బవుంటాం . ..... మంచో జనా సుఖినో భవంతు .....
 
Taken From AVS Blog

1 comment: