Saturday, October 2, 2010

ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం ..Sri Murali Mohan Garu

ఇంతకుముందు కంటే ఇప్పుడు అందరి తల్లి దండ్రులకి తమ పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక బలంగా పెరిగిపోయింది. తమలా తమ పిల్లల జీవితాలు కాకూడదు, తమ కంటే ఇంకా ఎన్నో రెట్లు సంతోషంగా వాళ్ళ జీవితాలు గడిచిపోవాలనే ఆశ వాళ్ళ మనసుల్లో ధృడంగా నాటుకుపోయింది. అందుకే ఎన్నో కష్ట నష్టాలకీ తట్టుకుని పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలకి ఇచ్చే ఆస్తి బాగా చదివించడమే. అంతకు మించి ఏమీ ఇవ్వలేని పరిస్థితి.

అయితే, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విధానం సరిగా లేకపోవడంతో విద్యార్ధులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో కానీ, బళ్లలో కానీ సరియైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అధ్యాపకుల కొరత ఉండటం మూలాన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు . వాళ్ళు చదువుతున్న స్కూళ్లలో ఏ తరగతి వరకు అందుబాటులో ఉంటే అంతవరకూ చదువుతున్నారు. లేదంటే పక్క ఊళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారు. దీని వల్ల ఎంతో విలువైన సమయాన్ని విద్యార్ధులు కోల్పోతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ విద్యాలయాల్లో ఎక్కువగా తెలుగులోనే బోధన సాగుతూండటం వల్ల ఇంగ్లీషు భాష పైన పట్టు సాధించే అవకాశం విద్యార్ధులకు ఉండటం లేదు. ఈ రోజుల్లో తెలుగులో కానే మరే ఇతర భాషల్లో కానీ ఎంత మంచి ర్యాంకులు వచ్చినా, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం లేకుంటే , మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే మంచి మంచి ఉద్యోగాలు దొరకటం చాలా కష్టమైపోతోంది. అందువల్ల, ప్రైవేట్ విద్యాలయాల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆంగ్ల భాషపైన పట్టు సాధించేలా విద్యా బోధన సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే, ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ప్రభుతవా విద్యాలయాల్లో కూడా కనీసం ఆరవ తరగతి నుండైనా ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్పించడం, కంప్యూటర్ విద్య పైన అవగాహన కల్పించడం వంటి పనులు చేస్తేనే ఈ సమస్య నుండి మనం బయట పడగలం.

ఇటీవలే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం వచ్చే 2020 వసంవత్సరం కల్లా, ప్రపంచం మొత్తంలోనే అత్యధిక యువత ఉన్న దేశంగా భారతదేశం అవతరించబోతోందని తేలింది. కాబట్టి, మనం ఇప్పటినుండే మన విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ పోతే మన దేశం నుండి ఎంతో మంది విద్యావంతులు తయారవుతారు. మనదేశ కీర్తి పతాకాన్ని రెప రెపలాడిస్తారు.

సర్వే జనా సుఖినోభవంతు..

No comments:

Post a Comment